కరోనా రెండేళ్లపాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, ఎక్కడా ఏ ఒక్క పథకం ఆపకుండా సీఎం శ్రీ వైయస్ జగన్ అన్నీ అమలు చేశారు. దీంతో ఆయన పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగింది. అందుకే ప్రతి ఎన్నికల్లో ఆయన పార్టీకి ప్రజలు అపూర్వ విజయాలు అందిస్తున్నారు. వరద బాధితుల గురించి మాట్లాడటం మరిచిపోయి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం వైయస్ జగన్‌ను ఎదుర్కొనే శక్తిలేకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభానికి గల కారణలను సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చరిత్రహీనుడిగా మిగిలిన చంద్రబాబు, ఆయన పక్కవాయిద్యాలు వాయించే బృందం (దుష్ట చతుష్టయం), ఇంకా ఆ పక్కనున్న తైనాతీలు, కోరస్.. అందరూ ఏకోన్ముఖంగా ఒక దాడి. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది అనేది ప్రజల మనసుల్లో ఎక్కడానికి ఎంతటి విష ప్రచారానికి తెగిస్తున్నారు అనేది ప్రతిరోజూ చూస్తున్నాం. చివరకు పార్లమెంటులో ఒక ప్రశ్న వేసి, మూతి పగలగొట్టించుకున్నారు. 2014–19 మధ్య ఏకంగా రూ.1.62 లక్షల కోట్లకు లెక్కలు లేవని, కాగ్ అడిగితే రూ.51 వేల కోట్లకు మాత్రమే లెక్క చెప్పారని, స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానం చెప్పారు. దీంతో వారు తమ గోతిలో తామే పడ్డారు అని తెలియజేసారు.