కావలసిన పదార్ధాలు: అల్లం - 50గ్రా., బెల్లం - 50 గ్రా., ధనియాలు - రెండు స్పూన్లు, ఎండు మిర్చి - 5, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, జీలకర్ర - అరస్పూన్, ఆవాలు - అరస్పూన్, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - అరస్పూన్, నూనె - సరిపడా, వెల్లుల్లి - 4పాయలు, కరివేపాకు.
తయారీవిధానం:
-- అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను బారుముక్కలుగా కోసుకోవాలి. అలానే పచ్చిమిర్చికి మధ్యలో చిన్న చీలిక పెట్టుకుంటే సరిపోతుంది. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
-- అల్లం, ధనియాలు, జీలకర్ర, మూడు ఎండుమిర్చి లను ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని మిశ్రమంలా గ్రైండ్ చేసుకోవాలి.
-- స్టవ్ ఆన్ చేసి, కళాయి కానీ, మందపాటి గిన్నె గానీ పెట్టి, నూనె వెయ్యాలి.
-- నూనె కాగాక అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపాలి. వేగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేపుకోవాలి.
-- తర్వాత అందులో ఇందాక గ్రైండ్ చేసి పట్టుకున్న అల్లం ముద్దను కూడా వేసి బాగా కలపాలి.
-- అల్లం వేసిన తర్వాత స్టవ్ దగ్గరే ఉండి బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటి మాడువాసన వస్తుంది.
-- అల్లం ముద్ద కూడా వేగాక చింతపండు రసం పోసుకుని ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మరిగించాలి.
-- పులుసు మారిగోస్తుండగా, అందులో నిమ్మకాయంత బెల్లం వేస్తె టేస్ట్ బ్యాలన్స్ అవుతుంది.
-- ఈ పులుసును మరీ పల్చగా కాకుండా, దగ్గరికి అంటు పులుసులా పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుంది.