కావలసిన పదార్ధాలు:
పుల్ల గోంగూర - 4 కట్టలు, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి -5, పసుపు - చిటికెడు, కారం - 1 స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత, కరివేపాకు - 1 రెబ్బ, కొత్తిమీర తరుగు - కొద్దిగా, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్, పొడి మసాలా - 1 స్పూన్.
తయారీవిధానం:
-- ముందుగా గోంగూర ఆకులను కోసి, మట్టి లేకుండా, శుభ్రంగా నీటితో కడగాలి. ఆపై ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
-- ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి.
-- స్టవ్ ఆన్ చేసి, మందపాటి గిన్నెను పెట్టి, నూనె వెయ్యాలి.
-- నూనె బాగా కాగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేపుకోవాలి.
-- దోరగా వేగాక, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి ఇంకాస్త వేపుకోవాలి.
-- అందులో పసుపు, ఉప్పు, కారం, పొడి మసాలా వేసి ఐదు నిముషాలు వేపుకోవాలి.
-- ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా కలపి మూత పెట్టుకోవాలి. గోంగూరలో పుల్లదనం ఉంటుంది కాబట్టి, ఒక్కచుక్క నీటిని కూడా కలపాల్సిన అవసరం ఉండదు.
-- పావుగంట ఆగిన తరవాత కొద్దిగా కొత్తిమీర తరుగును చేర్చుకుంటే సరి. మసాలా గోంగూర రెడీ.
-- రైస్, బిరియాని రైస్ లలోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది.