అమెరికాకు చెందిన సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ పుస్తకం తాజాగా అంతర్జాతీయంగా కాకపుట్టిస్తోంది. భారత మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయంలో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆయనది సహజ మరణం కాదని, అగ్రరాజ్యం అమెరికానే పథకం ప్రకారం చేసిన హత్య అని వెల్లడైంది. శాస్త్రితో పాటు భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్ భాభాను కూడా అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ హత్య చేసింది. ఈ విషయాలను సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ తన పుస్తకంలో వెల్లడించారు. శాస్త్రి, భాభా మరణించినప్పుడు క్రౌలీ సీఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తించారు.
శాస్త్రి, భాభా నేతృత్వంలో అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్న భారత్.. తమ శత్రు దేశం రష్యాతో అంటకాగడం అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి.. వారి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని తన పుస్తకంలో వివరించారు. భారతీయులు ఎంతో తెలివైనవారని, వాళ్లు ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదగడాన్ని తాము కోరుకోలేదని చెప్పారు.
1966 జనవరి 11న పాకిస్థాన్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్ రాజధానిలో తాష్కెంట్ ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మరణించడం వెనక సీఐఏ హస్తం ఉందని క్రౌలీ పేర్కొన్నారు.
ఇక హోమీ భాభా ఎయిర్ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా హతమార్చినట్టు క్రౌలీ తెలిపారు. చాలా కష్టపడి ఆ విమానంలోకి పేలుడు పదార్థాలు పంపామన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని తొలుత వియన్నా గగనతలంలో పేల్చేద్దామనుకున్నామని చెప్పారు. అయితే, అలా జరిగితే, ప్రాణనష్టం ఎక్కువ అవుతుందని భావించి పర్వత ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. విస్పోటనం తర్వాత విమానం ముక్కలుముక్కలు కావడానికి కూడా అనుకూలంగా వుండేలా ఎత్తయిన పర్వత ప్రాంతాన్ని ఎంచుకుని, అక్కడే కూలిపోయేలా చేశామని తెలిపారు.