రంగసాయి నాటక సంఘం 12 వ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని హాస్య నాటకోత్సవాలు ఫెస్టివల్ వచ్చేనెల ఆగష్టు 1 సోమవారం 4 గంట ల నుండి రాత్రి 9. 30 వరకు మద్దిలపాలెం కళాభారతి ఎ. సి. ఆడిటోరియం వేదిక గా నిర్వహించనున్న కార్యక్రమం ప్రచార పోస్టర్ ను శుక్రవారం సాయంత్రం జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాటక ఉత్సవాల ఫెస్టివల్ చైర్మన్, జీవీఎంసీ కార్మిక నాయకులు శ్రమశక్తి అవార్డు గ్రహీత వి. వి. వామన రావు, రంగ సాయి నాటక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాదంగీర్ సాయి పాల్గొన్నారు. హాస్య నాటికల ప్రదర్శనలో భాగంగా ది ఆమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ చిలకలూరిపేట వారిచే అద్దేపల్లి భరత్ కుమార్ రచన లో షఫీ దర్శకత్వంలో " ఆలితో సరదాగా " నాటిక ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రంగసాయి నాటక సంఘం విశాఖపట్నం వారిచే "నటులున్నారు జాగ్రత్త " బళ్లా షణ్ముఖరావు రచనలో, నవరసమూర్తి
దర్శకత్వం లో ప్రదర్శించబడుతుందన్నారు.
తర్వాత రంగసాయి నాటక సంఘం విశాఖపట్నం వారిచే "పుటుక్కు జర జర డుబుక్కుమే " నాటికను దివాకర్ బాబు రచనలో పి శివప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించబడుతుందన్నారు. ఫెస్టివల్ చైర్మన్ శ్రమశక్తి అవార్డు గ్రహీత , కార్మిక నాయకులు వి. వి. వామనరావు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కర్టెన్ కాల్ థియేటర్ హైదరాబాద్ వారిచే సురభి సంతోష్ దర్శకత్వంలో " పెట్రోమాక్స్ పంచాయితీ " శ్రీ ఫణీశ్వరనాథ్ రేణు కథామూలం, డా ॥ వెంకట్ గోవాడ నాటకీకరణలో ప్రదర్శించబడుతుందన్నారు. ప్రముఖ గాయకుడు ఆర్. వి. వి. సత్యనారాయణచే "అల్లూరి సీతారామరాజు" ఏకపాత్రాభినయం ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కి చెందిన సంఘం అకాడమీ సంజయ్ కిషోర్ కి రంగసాయి ప్రతిభా పురస్కారాన్ని అందజేశాయ నున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్రికేయులు ఎన్. ఎన్. ఆర్ నిర్వహణ బాధ్యతలు వహిస్తారని తెలిపారు.