పశ్చిమ బెంగాల్ పరిశ్రమల మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్ట్ చేసింది. గతంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో టీచర్ల నియామకాలలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ స్కామ్‌తో ప్రమేయముందనే ఆరోపణలతో మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఈ కేసులో ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ.20 కోట్లను శుక్రవారం ఈడీ స్వాధీనం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa