స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయింది. చాలా మంది గంటల తరబడి ఫోన్‌కు అతుక్కుపోతుంటారు. చివరికి టాయిలెట్‌లోనూ ఫోన్ వాడుతుంటారు. దీని వల్ల చాలా సమస్యలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. హానికరమైన బాక్టీరియా, వైరస్‌లు మన కడుపులో చేరతాయి. దీంతో మూత్ర సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఉంది. టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదముంది.