ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మంగళవారం కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పెదపూడికి చేరుకుని ఆ తర్వాత పుచ్చకయలవారిపేటలో వరద బాధితులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. వాడ్రేవుపల్లికి మధ్యాహ్నం 2.05 గంటకు చేరుకుని వరద బాధితులతో భేటీ కానున్నారు. సాయంత్రం 4.05 గంటలకు రాజమహేంద్ర వరం చేరుకుని అధికారులతో సమీక్షించనున్నారు.