వరల్డ్ బ్యాంక్‌లో భారత సంతతి ఆర్థికవేత్తకు కీలక పదవి దక్కింది. చీఫ్ ఎకనమిస్ట్‌గా భారత మూలాలున్న ఆర్థికవేత్త ఇందర్‌మిత్ గిల్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. చికాగో యూనివర్సిటీ, జార్జిటౌన్ యూనివర్సిటీలలో ప్రస్తుతం ఆయన బోధనా వృత్తిలో ఉన్నారు. గతంలో ఈ పదవిని భారత సంతతికి చెందిన రఘురామ్ రాజన్, గీతా గోపీనాథ్, కౌశిక్ బసు చేపట్టారు.