ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో వివాహితను ఆమె బావ హత్య చేశాడు. యూపీలోని మీరట్ జిల్లా జానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్‌పూర్‌లో సోమవారం ఈ దారుణం జరిగింది. ట్వింకిల్ అనే మహిళకు గౌరవ్‌తో 2017లో వివాహమైంది. 2021లో గౌరవ్ చనిపోయాడు. అయితే ఇటీవల ట్వింకిల్ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడంతో బావ అభిషేక్‌కు అనుమానం తలెత్తింది. ఆమెను సుత్తితో కొట్టి హత్య చేశాడు. మృతురాలికి ముగ్గురు పిల్లలున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa