కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్ల్యూ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌తో వయనాడ్‌లోని రెండు పందుల పెంపకం కేంద్రాల్లో 44 పందులు మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 685 పందులను హతమార్చారు. ఈ వైరస్ సోకిన పందులను చంపడం తప్ప మరో మార్గం లేదని పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ రాజేష్ తెలిపారు. అయితే, ఈ ఫ్లూ ఇతర జంతువులకు గానీ, మనుషులకు గానీ విస్తరించే అవకాశం లేదని పేర్కొన్నారు.