గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 54వ సచివాలయ పరిధిలోని మోహన్ దాస్ కాంప్లెక్స్ నుండి మొదలై కోనేరు వారి స్ట్రీట్,పాములవారి స్ట్రీట్,కౌండిన్య నగర్ మరియు NSM స్కూల్ ప్రాంతాల్లో జరిగింది. ఈ సందర్భంగా అయన , వైసీపీ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులకు వివరించి,అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.13వ డివిజన్ రాయళ్ల విజయలక్ష్మి జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి తీసుకురాగా ఈ రోజు రూ.20000/- విలువ చేసే తోపుడు బండిని దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా వారికీ అందజేయడం జరిగింది.