ద్విచక్రవాహనాలను దొంగతనం చేసే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 19 లక్షలు విలువ చేసే 15 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డిగుంట చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నామన్నారు.