ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌తో జరగాల్సిన చివరి వన్డే వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ధావన్, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. వెస్టిండీస్‌పై వరుసగా 12 వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తాజా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.