అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరిటాకులో భోజనం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపులో వచ్చే అలర్జీ, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.అరిటాకులో పొటాషియం ఉండటం వల్ల అది మన గుండెకు మేలు చేస్తుంది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులను దూరం చేయడంలో అరిటాకు ఎంతో సహాయపడుతుంది.