గుజరాత్‌లోని బోటాడ్ లో కల్తీ మద్యానికి బలైన వారి సంఖ్య బుధవారంతో 42కు చేరుకుందని హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి, సర్ టీ ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడగగా, తమకు నాటు సారా ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిషేధిత మద్యాన్ని అమ్మిన వారితో పాటు తాగినవారిపైనా చట్టపరమైన చర్యలుంటాయని హోంమంత్రి చెప్పారు.