కడియం గ్రామంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాలతో డాక్టర్ గోరంట్ల రవి కిరణ్ వారి పర్యవేక్షణలో మండల తె.దే.పా అధ్యక్షులు వెలుగుబంటి రాఘురామ్ (నాని) క్రిమి సంహారక మందును గ్రామంలో పిచికారి చేసారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలుకు వరద నీరు నిల్వ ఉండడం వల్ల విష జ్వరాలు మలేరియా,డెంగు మరియు అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని గోరంట్ల రవి కిరణ్ వారి దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగిందని వారు శాసనసభ్యులతో మాట్లాడి వారి సొంత నిధులతో వేంటనే ట్రాక్టరుతో పాటు పిచికారి యంత్రాలను, మందును పంపించడం జరిగిందని తెలిపారు.
డాక్టర్ రవి రామ్ కిరణ్ గోరంట్ల సూచించినట్లు ప్రజలందరూ ముఖ్యంగా ఇంటి పరిసరాలలో చెత్త కానీ పనికిరాని వస్తువులు టైర్లు కానీ ఇంటి పరిసరాలలో ఉంచుకోకూడదు అని అందరూ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రతలు తీసుకోవాలి అని ఆయన తెలియజేసారు.