జాస్తి హరిత వర్షిణి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గురువారం చోటుచేసుకుంది. విద్యార్థిని తండ్రి ప్రభాకర్‌రావు ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె చదువు కోసం మూడున్నర లక్షల అప్పు తీసుకున్నాడు. బ్యాంకు అధికారులు ఇంటివద్దకు వచ్చి త్వరలోనే జైలుకు వెళ్తావంటూ అతన్ని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa