ఆసియాలోనే అత్యంత సంపన్నురాలుగా ఉన్న చైనాకు చెందిన యంగ్ హుయన్, చైనా రియల్ దెబ్బకు భారీగా నష్టపోయారు. ఏడాది క్రితం ఆమె సంపద 23.7 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆమెకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గార్డెన్ అనే సంస్థలో మెజారిటీ వాటాదారుగా ఉన్నారు. బుధవారం ఆ సంస్థ షేర్లు 15% తగ్గాయి. ప్రస్తుతం ఆమె సంపద 11.3 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.