శ్రావణమాసం శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శ్రీశైల క్షేత్రం ముస్తాబైంది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శ్రీశైలం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అందుకే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ఈవో లవన్న వెల్లడించారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 28వ తేది వరకు శ్రీశైలంలో ఉత్సవాలు జరుగనున్నాయి. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు.