భారత్ లో మంకీపాక్స్ కేసులు వెలుగుచూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ కట్టడికి చర్యలు చేపట్టింది. వ్యాధిని కట్టడి చేయడంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు చేయడం, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇవ్వనుందని అధికార వర్గాలు తెలిపాయి.