నేటి నుంచి ప్రారంభం కానున్న శ్రావణమాసం సందర్భంగా సారవకోట మండలంలోని గొర్రిబంద గ్రామంలో ఉన్న సంతోషి మాత ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. అమ్మవారి మూలవిరాట్ కు ఆలయ పూజారి సోమేశ్వర రావు ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దేవి కటాక్షం కోసం ప్రత్యేక కుంకుమార్చనలు చేయనున్నట్లు అర్చకులు తెలిపారు. అదే రోజు సాయంత్రం గొర్రిబంద, కొత్తపేట, సారవకోట పురవీధులలో కళశాలతో అమ్మవారి ఉత్సవ మూర్తులను తిరువీధుల నిర్వహించనున్నట్లు, మూడవ శుక్రవారం ఆగస్టు నెల 12వ తేదీన అమ్మవారి జన్మదినం మరియు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉదయం అమ్మవారి ఆలయంలో మూర్తులతో పాటు మూల విరాట్ కు మంగళ స్నానాలు చేయించి క్షీరాభిషేకం కార్యక్రమం చేయటానికి సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రావణ మాసం ముగిసే వరకు ప్రతి శుక్రవారము ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు. జరుగుతాయని భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పునీతులు కావాలని ఆలయ అర్చకులు సోమేశ్వరరావుకోరారు.