ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు దేశ, విదేశాలు తిరిగి, అన్ని ప్రాంతాలు పరిశీలించారు. మన రాష్ట్రానికి వచ్చి అక్కడ విద్య బాగుంది.. అక్కడ ఆరోగ్యం బాగుంది.. అక్కడ గర్భవతి ఫోన్‌కొడితే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తుందని చెప్పేవారే తప్ప.. ఇవన్నీ నా ప్రజలకు ఉండాలి.. అందాలని ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆరోజు ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, 108 ప్రవేశపెట్టారు. ఆస్తులకు వారసులు ఉంటారు.. సంపదకు, కీర్తికి వారసులుంటారు. కానీ, వైయస్‌ఆర్ ఆశయాలకు వారసుడు సీఎం వైయస్ జగన్. మళ్లీ 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మళ్లీ ఇక్కడే మంచి సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్‌ను కోరుకుంటున్నాను’ అని ఎంపీ వంగా గీత తెలియజేసారు.