‘పిఠాపురం నియోజకవర్గానికి సీఎం వైయస్ జగన్ రూ.422 కోట్లతో హార్బర్ ఇచ్చారు. సాగరమాల రోడ్డును ఉప్పాడ తీర ప్రాంతంలో ఇచ్చారు. వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి.
ఏలేరు ఆధునీకరణ ఆరోజున దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఫేజ్–1 60 శాతం పూర్తయింది.. మిగతా పనులు పూర్తిచేసి.. ఫేజ్–2 కోసం రూ.200 కోట్లు ఇచ్చి పూర్తిచేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు.
అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ కొత్తగా ఏర్పడిన సందర్భంగా సపరేట్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని, నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎంను కోరారు.