విజయనగరం జిల్లా, DPOలో జూలై 29న Mrs. M. దీపికా, IPS, మాసాంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో నమోదై, దర్యాప్తులో ఉన్న చీటింగ్, తీవ్రమైన, సాధారణ కేసులను సమీక్షించినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... దర్యాప్తును వేగవంతం చేయాలని, త్వరితగతిన కోర్టుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను త్వరగతిన విచారణకి పంపే ప్రక్రియ మొదలు పెట్టాలని ఈ సందర్భంగా అధికారులని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa