నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 74వ రోజున మూలాపేటలోని కోనేటిమిట్ట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని వరద బాధిత కుటుంబాలకు 2వేల రూపాయల ఆర్థిక సాయం కాదని 10వేల రూపాయల ఆర్ధిక సాయం చేయాలని ప్రజలు అర్థిస్తే దానికి సమాధానంగా కరెన్సీ నోట్లు ప్రింట్ చేసే కేంద్ర ప్రభుత్వమే డబ్బు లేదని అంటోందని, ఇక తమ వద్ద ఎలా ఉంటుందని మాట్లాడడం పూర్తిగా బాధ్యతారాహిత్యం అని అన్నారు.
ముఖ్యమంత్రి మాటలు కరెన్సీ నోట్ల ముద్రణపై ప్రజల్లో అపోహలు పెంచే విధంగా ఉన్నాయని అన్నారు. వందలాది సలహాదారులున్న ముఖ్యమంత్రి ఆర్థికపరమైన అంశాల్లో ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతారా అని దుయ్యబట్టారు. తనకు తెలిసినంత వరకు భారతదేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో జరుగుతుందని, మనదేశంలో ముద్రించే ప్రతి రూపాయికి సరి సమానమైన బంగారం లేదా విలువని రిజర్వ్ చేసి పెట్టే బాధ్యత ఆర్బీఐది అని అన్నారు.
నగదు ముద్రణకు సరిసమానమైన విలువ గల నిలువలు లేకుండా ఈ దేశంలో నగదు ముద్రణ జరగదని, స్వదేశంలో మరియు విదేశాల్లో చలామణి అయ్యే ప్రతి రూపాయికి, మన కరెన్సీ విలువకి ఆర్బీఐ బాధ్యత వహిస్తుందని, ఎవరైనా సరే తమకు కరెన్సీ నోట్లు వద్దు సంబంధిత విలువ ఇవ్వండి అని ఆర్బీఐని సంప్రదిస్తే వారికి రిజర్వ్ లో నుండి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇటువంటి సాధారణ ఆర్థిక అంశాలు కూడా తెలియకుండా సీఎం జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని, కొన్ని రోజుల తర్వాత పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు కావాలి, డబ్బు ప్రింట్ చేసి ఇవ్వండి అని అడుగుతారేమో అని, కేంద్రం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వంతో, రిజర్వ్ బ్యాంక్ తో మాకేం పని మా రాష్ట్రానికి అవసరమయ్యే కరెన్సీ మేమే ముద్రించుకుంటాం అని కూడా అంటారేమో అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎద్దేవా చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa