ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ( ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం ) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల అధికారులను ఆదేశించారు . శుక్రవారం సాయంత్రం ఆయన స్పందన సమావేశపు హాల్ లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై జిల్లా నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు . ఆయా తేదీలలో అధికారులు నిర్వహించవలసిన కార్యక్రమాలు , తీసుకుంటున్న చర్యలపై ఆయన చర్చించారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa