ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యపాన నిషేధం మేం అనలేదు: అమర్‌నాథ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 08:43 PM

మద్యపాన నిషేధంపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా. ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వింత వివరణ ఇచ్చారు. మద్య నిషేధం అనే మాటే చెప్పలేదని బుకాయించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ''మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యం నిషేధిస్తాం. 


మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం'' ఇదీ వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నాలుగు లైన్ల వాగ్దానం. కానీ, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాత్రం మద్య నిషేధం అనే మాటే మా మేనిఫెస్టోలో లేదంటున్నారు. మేనిఫెస్టోలో మీరు ఈ మాట చెప్పారు. చెప్పిన మాట ప్రకారం చేయలేదంటే ప్రశ్నించండి అని మీడియా ప్రతినిధులకు సవాల్‌ విసిరారు. మద్యం రేట్లు ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో కంటే ఎక్కువ పెడతాం, ఎవరైనా ముట్టుకోవాలంటే షాక్‌ కొట్టే పరిస్థితి తీసుకొస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా మా మేనిఫెస్టో గోడలపై ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com