అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్లో ఆరుగురు విద్యార్థులు గల్లంతైన దురదృష్టకర ఘటన తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసుకున్న ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం తనను బాధించిందని పవన్ అన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తన తరపున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.