నేపాల్ రాజధాని కఠ్మండూలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉ. 7.58 గంటల సమయంలో కఠ్మండూలో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ సీస్మోలజీ తెలిపింది. కఠ్మండూకు 170 కి.మీ దూరంలో ఉన్న ధిటుంగ్ వద్ద భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. కాగా, నేపాల్ సరిహద్దుల్లోని బీహార్‌కు చెందిన సీతామర్హి, ముజఫర్‌పూర్, భాగల్పూర్ లో కూడా భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు.