ఈపీఎఫ్‌వో పెన్షన్‌దారులకు సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇకనుంచి జీవన ధ్రువీకరణ పత్రాన్ని ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో ఎక్కడి నుంచైనా సమర్పించవచ్చు. దీంతో ఫింగర్ ప్రింట్, ఐరిస్ సరిగా నమోదుకాక పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. దీనిద్వారా దాదాపు 73 లక్షల మంది పెన్షన్‌దారులకు మరింత వెసులుబాటు కలుగుతుంది.