ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన మూడో టీ20లో సౌతాఫ్రికా 90 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను సౌతాఫ్రికా 2-1 తేడాతో గెలుచుకుంది. ఇవాళ జరిగిన మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 రన్స్ చేసింది. హెన్డ్రిక్స్ 70, మార్కరం 51*, రోస్సో 31 రన్స్ చేశారు. అనంతరం ఇంగ్లాండ్ 101 రన్స్ కే ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లలో షంసి 5 వికెట్లు పడగొట్టాడు.