కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్ లిఫ్టర్స్ స్టార్ పర్‌ఫార్మర్లుగా నిలుస్తున్నారు. మూడో రోజు పోటీల్లో 20 సంవత్సరాల వయస్సున్న అచింతా షూలి 313 కేజీల బరువును ఎత్తి 73కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు.ముందుగా స్నాచ్ రౌండ్ లో 140 కేజీలు 143 కేజీలు ఎత్తి గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేసిన షూలి.. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో166 కేజీలు, 170కేజీలు ఎత్తేశాడు. ఫలితంగా ఓవరాల్ వెయిట్ లో అధికమైన బరువు ఎత్తడంతో స్వర్ణం కైవసం అయింది.ఫేవరేట్ గా బరిలోకి దిగిన షూలికి మలేసియాకు చెందిన ఎర్రీ హిదాయత్ మొహమ్మద్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. 303 కేజీలు ఎత్తి పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. కెనడాకు చెందిన షాద్ దర్సింగీ 298కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.
జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో షూలీ సిల్వర్ మెడలిస్ట్. స్నాచ్ సెషన్ లో 137, 140, 143కేజీలను ఎత్తేశాడు. 143కేజీలు ఎత్తడమనేది అతను గేమ్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి బాగా హెల్ప్ అయింది. దాంతోనే 166 కేజీలను ఈజీగా ఎత్తగలిలగాడు. ఇక మూడో అటెంప్ట్ తో 170కేజీలు ఎత్తి కొత్త గేమ్ రికార్డ్ నెలకొల్పాడు.మలేషియా ఆటగాడు తన చివరి రెండు ప్రయత్నాల్లో 176 కేజీల బరువును ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. టఫ్ కాంపిటీషన్ అయిన మలేషియా ఆటగాడి కోసం చివరి వరకూ ఓపికగా వేచి ఉండాల్సి వచ్చింది.
షెయులీ స్వర్ణంతో, భారత వెయిట్‌లిఫ్టింగ్ బృందం గేమ్స్‌లో ఆరో పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు పురుషుల 67 కేజీల విభాగంలో 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా స్వర్ణ పతకాన్ని సాధించాడు.