టీడీపీ అనుకూల మీడియాలో తనపై నెగెటివ్ వార్తలు మాత్రమే ఇస్తారని.. పాజిటివ్ వార్తలు ఎలాగూ ఇవ్వరన్నారు. ఇలా నెగెటివ్‌గా ప్రచారం చేసిన.. తన కోసం ప్రత్యేకంగా స్పేస్ కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఈ విధంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ వీడియోను విడుదల చేశారు. తనపై ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కొంతమంది శునకానందం పొందుతున్నారన్నారు. తాను పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. తాను 375 ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకోవడంతోపాటు.. వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేసినట్లు చెప్పారు.
కానీ కొందరు గడప, గడపకు కార్యక్రమంలో తనను నిలదీసినట్లు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గడప గడపకు కార్యక్రమంలో ప్రజల్ని కలిసిన సమయంలో టీడీపీకి చెందిన ఒకరు, జనసేన పార్టీకి చెందిన ఒకరు సంక్షేమ పథకాలపై ప్రశ్నించారని వీడియోలో వివరించారు. దీనిని దుష్టచతుష్టయం చిలువలు పలువలు చేసిందని వీడియోలో చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో తనను మహిళలు నిలదీశారని.. బెండు తీశారని టీడీపీతో పాటూ మరికొందరు పదే పదే ప్రచారం చేస్తున్నారన్నారు. ముందుగానే కొంతమందిని ప్లాన్ చేసి వారితో తనను అడిగించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తనపై ఇలా ప్రచారం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని సెటైర్లు పేల్చారు. టీడీపీ అనుకూల మీడియాలో తనపై నెగెటివ్ వార్తలు మాత్రమే ఇస్తారని.. పాజిటివ్ వార్తలు ఎలాగూ ఇవ్వరన్నారు. ఇలా నెగెటివ్‌గా ప్రచారం చేసిన.. తన కోసం ప్రత్యేకంగా స్పేస్ కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు మంత్రి అంబటి రాంబాబు.