భూగర్భజలాల కాలుష్యం గురించి పార్లమెంట్‌లో కేంద్రం సంచలన విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం మనం తాగుతున్న నీరు విషపూరితమని మంగళవారం రాజ్యసభలో కేంద్రం అంగీకరించింది. ప్రతీ రాష్ట్రంలోనూ భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలున్నాయని స్పష్టంచేసింది. యురేనియం, ఆర్సెనిక్, ఐరన్, కాడ్మియం, క్రోమియం మోతాదులను మించి ఉన్నాయి. వీటి కారణంగా చర్మ వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తెలిపింది.