ఏపీ సీఎం జగన్ బుధవారం జగనన్న తోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.395 కోట్ల రుణాలను అందించనున్నారు. నేడు అందించనున్న రుణంతో కలిపి ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటివరకు 15,03,558 మంది లబ్ధిదారులకు రూ.2,011 కోట్లను అందించింది. గత 6 నెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ రీయంబర్స్ మెంట్ ను కూడా నేడు జమచేస్తారు.