పామాయిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయని సమాచారం. ట్రేడ్ డేటా ప్రకారం పామాయిల్ ధరలు తగ్గాయి. గత నెల రోజుల్లో చూస్తే జూలై 29 నాటికి పామాయిల్ టన్నుకు 14 శాతం తగ్గి 1,170 డాలర్లకు పడిపోయింది. అలాగే సోయాబీన్ ఆయిల్ ధర 4 శాతం తగ్గి టన్నుకు 1,460 డాలర్లకు చేరుకోగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 14 శాతం తగ్గి టన్నుకు 1,550 డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో పామాయిల్ నూనె ధరలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa