ఎస్బీఐ మరో సారి తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. SBIBNK, SBIINB, SBYONO, ATMSBI, SBI/SB వంటి ముఖ్యమైన కోడ్‌లు వస్తే బ్యాంకు అధికారికంగా పంపినట్లు అర్థం చేసుకోవాలని వెల్లడించింది. ఇలాంటి కోడ్ లు కాకుండా వేరే రకమైన కోడ్‌లు ఏమైనా ఉంటే అవి నకిలీవని గుర్తించాలి. అలాంటి మెస్సేజులు కస్టమర్లను మోసగించేందుకు పంపించారని తెలుసుకోవాలి. ఆ ఫేక్ మెసేజ్‌లోని లింక్‌లపై క్లిక్ చేయొద్దని ఎస్బీఐ తెలిపింది.