ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. జులై 23 వరకు 75 దేశాలలో 16 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. ఈ తరుణంలో మంకీపాక్స్‌ను డబ్ల్యూహెచ్‌వో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇండియాలో ఇప్పటి వరకు తొమ్మిది మంకీపాక్స్ కేసులు నమోదవడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కేసుల నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.