ఏపీ సీఎం జగన్ గురువారం కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమన్నారుకుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని తెలిపారు. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎంతో మేలు చేశామని, కుప్పం మున్సిపాలిటీకి రూ.65 కోట్ల పనులు మంజూరయ్యాయన్నారు. 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే ప్రారంభం కావాలని అన్నారు.