కాకినాడ జిల్లా తుని పర్యటనలో ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఆ మహిళ పేరు తనూజ. ప్రత్తిపాడు మండలం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన వాసి. సీఎం వస్తున్నారని తెలిసి తన బిడ్డతో రోడ్డు పక్కన నిరీక్షిస్తోంది. తుని ప్రాంతంలో తన కాన్వాయ్‌తో వెళ్తుండగా దారిలో సీఎం జగన్ వారిని గుర్తించారు. కాన్వాయ్‌ను ఆపి వారి సమస్యను తెలుసుకున్నారు. తల్లి తనూజ తన బిడ్డ ఆరోగ్య పరిస్థితిని సీఎంకు వివరించారు. ఆమెకు తక్షణ సహాయం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను సీఎం జగన్ ఆదేశించారు.