నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఈడీ అధికారులు విచారించారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో, పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ ఖర్గే విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఖర్గేను ఈడీ అధికారులు 5 గంటలకు పైగా విచారించారు.