గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని గొల్లాది గ్రామ సచివాలయ పరిధిలో గల కామన్నవలస గ్రామాల్లో 4వ రోజు స్థానిక శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల వివరాలను తెలిపే బుక్లెట్లను లబ్ధిదారులకు అందజేస్తూ ప్రభుత్వ పాలన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నామన్నారు. రోడ్లు, గొల్లది, కొత్తపెంట మధ్య ఉన్న వేగావతి నదిపై వంతెన నిర్మించాలని పలువురు స్థానికులు ఎమ్మెల్యే ని కోరగా దానికి ఆయనస్పందిస్తూ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి వంతెన, రోడ్లు నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తాము గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం వల్లనే దైర్యంగా ప్రజల ముందుకు వెళుతూ ప్రభుత్వ పాలన తీరు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు, ఎంపీపీ భోగి గౌరి, జడ్పీటీసీ పెద్దింటి రామారావు, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, సర్పంచ్ శంకరరావు, ఎంపీపీ. ప్రతినిధి తెంటు మధు, ఎంపీటీసీ ప్రతినిధి స్వామినాయుడు, మాజీ కురిటీ సర్పంచ్ సూర్యనారాయణ, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.