సెజ్లోని పేద కార్మికు లతో వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని భాజపా నియోజకవర్గ కన్వీనర్ రాజాన సన్యాసినా యుడు ఆరోపించారు. సీడ్స్ దుస్తుల తయారీ పరిశ్ర మలో వరుస ప్రమాదాలకు నిరసనగా గురువారం బ్రాండిక్స్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నెలలో జరి గిన ప్రమాదాన్ని వైకాపా ప్రభుత్వం సరిగ్గా పట్టించుకుని ఉంటే రెండోసారి జరిగి ఉండేది కాదన్నారు. వేలాదిమంది మహిళా కార్మికులు పనిచే స్తున్న పరిశ్రమను మూసివేస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ ప్రకటించడం అన్యాయమన్నారు. మహిళా కార్మి కుల ఉపాధి పోకుండా వారికి బ్రాండిక్స్ ఆవరణలోనే ఇతర పరిశ్ర మల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించా లని డిమాండ్ చేశారు. మంత్రి అమర్ నాథ్ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నినా దాలు చేశారు. బాధితులకు నష్టపరి చేశారు. సీడ్స్ పరిశ్రమను పరిశీలించ డానికి భాజపా నాయకులకు అనుమతి ఇవ్వకపోవ డంతో పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా వెనక్కి పంపించేశారు. భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, గొంతిన భక్తసాయిరాం, గోవిందరెడ్డి, రాష్ట్ర సైనిక సెల్ కన్వీనర్ అగ్గాల హనుమంతరావు, నాలుగు మండలాల భాజపా అధ్యక్షులు రాజాన రాజు, బుద్ద విశ్వనాథం, ఉమ్మిడి వెంకటేశ్వర్లు, పిట్టా దాసుబాబు, కొల్లి సత్యనారాయణ, అన్నెంరెడ్డి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.