రవాణా శాఖలో భర్తీ చేయనున్న ఏఎంవీఐ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ పోస్టులకు ఈ నెల 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్-1లో 54, మల్టీ జోన్-2లో 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.