గత ఎన్నికల కంటే ఎక్కవ మెజార్టీతో ఈ సారి ప్రభుత్వం తిరిగి తెచ్చుకోవాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. టార్గెట్ 175 లక్ష్యంగా ముందుకు సాగుతున్నారా. ఈ క్రమంలో రెండు రోజులుగా నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో భేటీ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేశామని.. ఆ ధైర్యంతోనే ఆశీర్వదించమని రాష్ట్రంలోని గడప గడపకూ వెళ్లగలుగుతున్నామన్నారు జగన్. ఇవన్నీ చూశాక మరో ముప్ఫై ఏళ్లపాటు ఈ ప్రభుత్వమే ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు.
రాజాం నియోజకవర్గంలో డీబీటీ కింద రూ.775 కోట్లు ఇచ్చామన్నారు సీఎం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇలాగే మంచి చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేసిన ఈ ప్రభుత్వం చేసిన మంచిని మరింత విపులంగా చెప్పాలని సూచించారరు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.. ఈసారి మరింత పెరగాలి అన్నారు. ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ ఈ ప్రభుత్వాన్నిఆశీర్వదించండి అని ధైర్యంగా అడగగలుగుతున్నామన్నారు.
రాజాం నియోజకవర్గం విషయానికి వస్తే.. 12,403 ఇంటి స్థలాలు ఇచ్చామని.. దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చామన్నారు. వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నారన్నారు. వాటి విలువ కనీసంగా మరో రూ.171 కోట్లు ఉంటుంది అన్నారు. ఇల్లు, రేషన్‌కార్డు, పెన్షన్.. ఇలా అన్నీ సమకూర్చారని.. 24 అనుబంధ విభాగాలు పార్టీకి ఉన్నాయని.. ఈ విభాగాలన్నింటికీ కమిటీలు ఏర్పాటు కావాలి అన్నారు. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు కావాలని.. వీలైనంత వరకూ ప్రతి కమిటీలో కూడా కచ్చితంగా 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. మొత్తం కమిటీలో యాభైశాతం మహిళలు ఉండేలా చూడాలన్నారు. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రాధాన్యతా క్రమంలో పనులకు మంజూరు కూడా చేస్తున్నామన్నారు.
ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఘన విజయాలు సాధించగలిగామని.. మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ ఎన్నికల్లో ఘన విజయాలు అందుకున్నామన్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని.. గ్రామంలోనే కళ్లముందే మార్పులు కనిపిస్తున్నాయన్నారు. ఈ మార్పులు అందరి కళ్లముందే ఫలితాలను ఇస్తాయన్నారు.
రాజాం నియోజకవర్గంలో అభివృద్ది పనులు, రోడ్లకు 1500కోట్లు మంజూరు చేసినట్లు సీఎం చెప్పారన్నారా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు. రాజాంలో తోటపల్లి కుడి కాలువ ,ఎడమ కాలువ ఆధునీకరణ చేస్తున్నామన్నారని.. రాజాం టౌన్ లో రోడ్ల వెడల్పు కోసం రూ.20 కోట్లతో పనులకు టెండర్లు పిలిచామన్నారు. అభివృద్ది పనులను నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేశారన్నారు. మిగిలినవి ఇస్తామన్నారన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. రాజాం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి రాజాం నియోజకవర్గ కార్యకర్తలు తీసుకెళ్లారన్నారు.ఈ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు.