భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక శనివారం జరగనుంది. పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు ఈ పోలింగ్‌లో పాల్గొననున్నారు. పార్లమెంటు భవనం మొదటి అంతస్తులోని 63వ నెంబరు గదిలో ఈ పోలింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్న ఎన్నికల సంఘం రాత్రికి ఫలితాన్ని వెల్లడించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa