ఇల్లులేనివారు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కేంద్రం 'వన్ నేషన్ వన్ రేషన్' పేరుతో కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అమలుచేయనున్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్ కార్డులు అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది.