గుజరాత్ రాష్ట్రం సబర్‌కాంతలోని గంభోయ్ గ్రామంలో గురువారం అమానుష ఘటన జరిగింది. శైలేష్, మంజు దంపతులు తమకు పుట్టిన ఆడ శిశువును బ్రతికుండగానే పాతిపెట్టేశారు. ఓ రైతు ఆ పసికందును కాపాడి, ఆసుపత్రికి తరలించాడు. నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం, చికిత్స చేయించేందుకు డబ్బులు లేక తల్లిదండ్రులు ఇలా చేసినట్లు తేలింది. దంపతులిద్దరినీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa