పెదకాకాని: మండలంలోని నంబూరులో రేషన్ బియ్యం నిల్వలని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మేడ భాగ్యలక్ష్మి, తోకల రమణ ఇళ్ల వెంట బియ్యం కొనుగోలు చేసి సుమారు 7. 5 క్వింటాళ్లను నంబూరులో నిల్వ చేశారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa